Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు : అరవింద్ కేజ్రీవాల్

Advertiesment
arvind kejriwal

ఠాగూర్

, బుధవారం, 11 డిశెంబరు 2024 (11:27 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వచ్చే యేడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. పైగా, ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్యలు తుది దశకు చేరుకున్నాయంటూ సమాచారం. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. 
 
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంత బలంతోనే ముందుకు వెళుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఆమ్ - కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు కూటమిలోని ఇతర పార్టీలకు ఒకటి లేదా రెండు సీట్లు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయంటూ వార్తలు రాగా, వీటిని అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. 
 
ఏపీలో జోరుగా మద్యం విక్రయాలు.. తెగ తాగేస్తున్న మందు బాబులు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యాపారులు మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో గత 55 రోజుల్లో రూ.4,677 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అంటే 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయని పేర్కొంది. 
 
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయాలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం వ్యాపారానికి స్వస్తి పలికింది. పాత విధానాన్నే అమల్లోకి తీసుకొచ్చింది. టెండర్లు పిలిచి లాటరీ పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపుల కేటాయింపు జరిపింది. 
 
ఈ క్రమంలో అక్టోబరు 16వ తేదీ నుంచి నుంచి రాష్ట్రంలో 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్సెజ్ శాఖ డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల లెక్కలను విడుదల చేసింది. కేవలం 55 రోజుల్లో 4,677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగిందని పేర్కొంది 
 
రాష్ట్ర వ్యాప్తంగా 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. 19,33,560 కేసుల బీర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. తమకు 20 శాతం కమీషన్ ఇవ్వాలని మద్యం దుకాణ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. 20 శాతం కమీషన్ ఇవ్వకుంటే నష్టాలు చవి చూస్తామని మద్యం విక్రయదారులు పేర్కొంటున్నారు. కమీషన్ అంశంపై రాష్ట్రంలో ఓ పక్క చర్చలు జరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్, రష్యా మధ్య స్నేహబంధం సముద్రం కంటే లోతైనది : రాజ్‌నాథ్ సింగ్