Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హర్యానా ఎన్నికల ఫలితాలు గుణపాఠం : అరవింద్ కేజ్రీవాల్

arvind kejriwal

ఠాగూర్

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (17:42 IST)
హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని పార్టీ శ్రేణులకు ఆయన హితవు పలికారు. హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఖాతా కూడా తెరవలేదు. 90 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 47, కాంగ్రెస్ 37, ఐఎన్‌ఎల్డీ 3 స్థానాల్లో ఉన్నాయి. ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కానీ, 90 సీట్లకుగాను 89 స్థానాల్లో పోటీ చేసిన ఆప్ పార్టీ ఒక్క చోటా కూడా విజయం సాధించలేక పోయింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, హర్యానా ఎన్నికల ఫలితాలు అతిపెద్ద గుణపాఠమన్నారు. ఎపుడూ అతివిశ్వాసం ఉండరాదని కేజ్రీవాల్ చెప్పారు. హర్యానాలో ఫలితాలు ఎవరికీ అనుకూలంగా ఉంటాయో చూద్దామని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలను కూడా అంత తేలిగ్గా తీసుకోరాదని సూచించారు. ప్రతి ఎన్నిక, ప్రతి సీటు కూడా ఎంతో క్లిష్టమైందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా