Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : హమ్మయ్య.. ఎట్టకేలకు వినేశ్ ఫొగాట్ గెలుపు

vinesh phogat

ఠాగూర్

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (14:25 IST)
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఎట్టకేలకు విజయం సాధించారు. మంగళవారం వెల్లడవుతున్న ఫలితాల్లో తొలుత ఆధిక్యంలో కొనసాగి, ఆతర్వాత వెనుకంజలోకి వెళ్లిన ఆమె... చివరకు గెలుపును సొంతం చేసుకున్నారు. హర్యానా రాష్ట్రంలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన వినేశ్ ఫొగాట్... బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌ను ఓడించారు. 
 
వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలుపుతూ పోస్టు పెట్టారు. 'విజయం సాధించిన భారత పుత్రిక వినేశ్‌ ఫొగాట్‌కు అభినందనలు. ఇది జులానా సీటుకు సంబంధించిన పోటీ కాదు. అలాగే ఏదో మూడు నాలుగు స్థానాలు, పార్టీల మధ్య పోరు అసలే కాదు. ఈ పోరు బలమైన అణచివేత శక్తుల మధ్య జరిగింది. అందులో వినేశ్‌ గెలిచింది' అని ఆమె ఫొటోను షేర్ చేశారు. 
 
తన సమీప భాజపా ప్రత్యర్థిపై ఆరువేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. అక్టోబరు 5వ తేదీన హర్యానా ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ మూడోసారి అధికారాన్ని చేపట్టే దిశగా పయనిస్తోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించినా.. తర్వాత కమలం దాటికి నిలవలేక రెండో స్థానానికి పరిమితమైంది.  
 
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో వినేశ్‌ ఫొగాట్‌ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఖాళీ చేతులతో ఆమె స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. ఆ పరిణామం యావత్ భారతావనిని బాధించింది. అనంతరం భవిష్యత్ కార్యాచరణనను ప్రకటించిన ఆమె కాంగ్రెస్‌లో చేరి రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానం... జైరామ్ రమేష్ ట్వీట్