Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న వైద్యుడు ... ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (13:37 IST)
ఢిల్లీలో ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కలకలం రేపుతోంది. తన చావుకు ఓ ఎమ్మెల్యేనే కారణమంటూ ఆరోపణ చేశారు. అత‌ని సూసైడ్ నోట్ మేర‌కు పోలీసులు స‌ద‌రు ఎమ్మెల్యేపై కేసు న‌మోదు చేశారు. 
 
పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఢిల్లీలోని దుర్గావిహార్‌లో నివ‌సించే రాజేంద్ర సింగ్ అటు వైద్యుడిగా ప‌నిచేస్తూనే, ఇటు వాట‌ర్ ట్యాంక‌ర్ల వ్యాపారం చేసేవాడు. ఈ క్ర‌మంలో ఢిల్లీ జ‌ల బోర్డులో త‌న వాట‌ర్ ట్యాంక‌ర్లు అద్దెకు ఇచ్చాడు. 
 
అయితే ఈ కాంట్రాక్టు కొన‌సాగాలంటే డ‌బ్బులు ముట్ట‌జెప్పాలంటూ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ జర్వాల్ డ‌బ్బులు డిమాండ్ చేశాడు. దానికి రాజేంద్ర సింగ్ నిరాక‌రించగా.. అత‌ని నీటిట్యాంక‌ర్ల‌ను జ‌ల బోర్డు నుంచి తొలగించి వేధింపుల‌కు పాల్ప‌డ్డారు. 
 
ఈ నేప‌థ్యంలో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన ఆయ‌న‌ శ‌నివారం ఉద‌యం ఇంట్లో ఉరేసుకుని చ‌నిపోయాడు. ఎమ్మెల్యేతో పాటు అత‌ని అనుచ‌రుడు కనపిల్ నాగ‌ర్ కూడా వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. వారి నుంచి త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరాడు. 
 
ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్‌కు త‌ర‌లించారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఎమ్మెల్యేపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా గ‌తంలో ఓ మ‌హిళ‌ను వేధించినందుకుగానూ 2018లో ఎమ్మెల్యే ప్ర‌కాశ్ జ‌ర్వాల్‌పై కేసు న‌మోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments