Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో లాక్‌డౌన్ : కాలపరిమితిని పొడగించిన టెల్కో కంపెనీలు

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (12:18 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. దీంతో మొబైల్ వినియోగదారులకు ఊరట కల్పించేలా నాలుగు టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు బీఎస్ఎన్ఎల్ కంపెనీలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 16వ తేదీతో వ్యాలిడిటీ ముగిసిన ప్రీపెయిడ్ నంబర్లన్నిటికీ మే మూడో తేదీ వరకు వ్యాలిడిటీని పొడగించింది. 
 
లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ప్యాక్‌ల చెల్లుబాటు గడువు (వ్యాలిడిటీ పీరియడ్‌)ను పొడిగించాయి. లాక్‌డౌన్‌ ముగిసే వరకు తమ వినియోగదారులకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను అందజేస్తామని రిలయన్స్‌ జియో ప్రకటించింది. దీనివల్ల కేవలం అల్పాదాయ వినియోగదారులకే కాకుండా ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్లాన్లను రీచార్జిచేసుకోలేకపోతున్న వారందరికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. 
 
ఇదేవిధంగా తమ నెట్‌వర్క్‌ల పరిధిలోని దాదాపు 12 కోట్ల మంది అల్పాదాయ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ల గడువును వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వెల్లడించాయి. మరోవైపు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ ఎల్‌ తమ ఖాతాదారులకు మే 5 వరకు ఇన్‌కంమింగ్‌ కాల్స్‌ సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments