Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ యాప్‌లో పరిచయం... ప్రియుడి ఇంటికెళ్లి శవమై తేలింది...

డేటింగ్ యాప్‌లు ఎంత ప్రమాదకరమో వేరే చెప్పక్కర్లేదు. ఈ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో ప్రేమలో పడిపోయిన ఓ యువతి శవమై తేలింది. ఇది ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే... మార్చి 22న తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందిం

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (21:39 IST)
డేటింగ్ యాప్‌లు ఎంత ప్రమాదకరమో వేరే చెప్పక్కర్లేదు. ఈ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో ప్రేమలో పడిపోయిన ఓ యువతి శవమై తేలింది. ఇది ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే... మార్చి 22న తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న 21 సంవత్సరాల యువతికి డేటింగ్ యాప్ ద్వారా ఇష్రత్ అలీతో అనే వ్యక్తితో పరిచయం కలిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో సదరు యువతి మార్చి 22న మధ్యాహ్నం భోజనం చేసేందుకు ద్వారకా సెక్టార్ 13 వద్దకు అతడితో కలిసి వెళ్లింది. భోజనం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి అతడి ఇంట్లోనే గడిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇష్రత్ ఆమె తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని సమీపంలోని డ్రైనేజిలో పడేశాడు. 
 
ఆ తర్వాత ఆమె తండ్రికి ఫోన్ చేసి మీ కుమార్తెను కిడ్నాప్ చేశాననీ, రూ. 50 లక్షలిస్తే వదిలిపెడ్తానని బెదిరించాడు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి అతడిని పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments