టీచర్లపై లైంగిక వేధింపులు.. అరెస్ట్.. ఆపై బెయిల్ మంజూరు

టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ అరెస్టయ్యాడు. ఆపై అతనికి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీ టీచర్లపై లైంగ

బుధవారం, 21 మార్చి 2018 (09:01 IST)
టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ అరెస్టయ్యాడు. ఆపై అతనికి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీ టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఇతనిపై ఎనిమిది మంది టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టి 14 రోజుల కస్టడీని కోరారు. 
 
కానీ తనను జైలుకు పంపితే తన కెరీర్ నాశనమైపోతుందని.. కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ తనను జైలుకు పంపితే తన కెరీర్ నాశనమైపోతుందని.. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పాటియాలా హౌస్ కోర్టును జోహ్రీ అభ్యర్థించారు. దీంతో స్పందించిన కోర్టు జోహ్రీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలైన జోహ్రీ తన విధులకు రాజీనామా చేశారు. అయితే టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ బెయిల్‌పై విడుదల కావడాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అన్న అతిపెద్ద రాష్ట్రానికి సీఎం.. చెల్లేమో టీ విక్రయిస్తోంది.. ఎక్కడ?