స్కూల్‌కు బాంబు బెదిరింపు పంపిన విద్యార్థి.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (14:11 IST)
ఓ విద్యార్థి ఒకడు తాను చదువుతున్న పాఠశాలకే బాంబు బెదిరింపుపంపాడు. పాఠశాలకు వెళ్లేందుకు మూడ్ లేకపోవడంతో ఈ పనికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలో చోటుచేసుకుంది. బాంబు పెట్టినట్టు బెదిరింపు రావడంతో స్కూల్ యాజమాన్యం స్కూల్ మొత్తానికి సెలవు ప్రటించింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్‌కు చెందిన 14 యేళ్ల బాలుడు శుక్రవారం పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కానీ, తల్లిదండ్రులు మాత్రం స్కూల్‍‌కు వెళ్ళాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపాడు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం చేయడంతో వారు వచ్చి స్కూల్ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈమెయిల్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇందులో ఆ పాఠశాలలో చదివే 14 యేళ్ల బాలుడే ఈ బెదిరింపులకు పాల్పడినట్టు తేలింది. పైగా, తాను పంపిన మెయిల్ నమ్మదగినదిగా ఉండేందుకు వీలుగా మరో రెండు పాఠశాలలకు కూడా మెయిల్స్ పంపించినట్టు అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments