ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 43 స్థానాల్లో ఆధిక్యం

ఐవీఆర్
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:08 IST)
Delhi Assembly results ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఆ పార్టీ 43 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుండగా ఆప్ కేవలం 26 చోట్ల ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ పార్టీ 1 చోట ముందంజలో వుంది. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను భాజపా దాటేసింది. దీనితో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
 
మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో వున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి అరవింద్ కేజ్రీవాల్, భారతీయ జనతా పార్టీ (BJP) నుండి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, భారత జాతీయ కాంగ్రెస్ (INC) నుండి సందీప్ దీక్షిత్ వంటి కీలక అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
 
తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అరవింద్ కేజ్రీవాల్ నాల్గవసారి ముఖ్యమంత్రి అవుతారని AAP ధీమా వ్యక్తం చేసింది. కానీ అగ్ర నాయకులు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అతిషి తమ తమ స్థానాల్లో వెనుకబడి ఉన్నారని ప్రారంభ ధోరణులు సూచిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments