Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Advertiesment
Woman Fire

సెల్వి

, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (22:13 IST)
తన భార్య కళ్ళలో కారం పొడి చల్లి సజీవ దహనం చేసిన దారుణ నేరానికి ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధించింది ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని ఓ కోర్టు. వివరాల్లోకి వెళితే.. సచిన్ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. తన భర్త ప్రవర్తనను భార్య వ్యతిరేకించింది. 
 
ఈ వ్యవహారంపై రోజూ గొడవలు జరిగేవి. ఇంకా తన భార్యను కొడుతుండేవాడని తెలిసింది. ఆమెను వేధించడంలో అతని అత్తమామలు కూడా తోడయ్యారు. బాధితురాలు మరణించే సమయానికి 35 సంవత్సరాలు. 2012లో మృతురాలు సచిన్‌ను వివాహం చేసుకుంది.  
 
ఈ సంఘటన ఏప్రిల్ 3, 2022న జరిగింది. ఆ రోజు తన భార్యను వేధింపులకు గురి చేసి.. సచిన్ ఆమె కళ్ళలో కారం పొడి చల్లాడు. ఆపై ఆమెను సచిన్ తల్లిదండ్రులు, బంధువుల మద్దతుతో ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించాడు. మూడు నెలలకు పైగా ప్రాణాలతో పోరాడిన ఆమె జూలై 3, 2022న మరణించింది. ఈ నేపథ్యంలో బిజ్నోర్‌ అదనపు సెషన్స్ జడ్జి అనుపమ్ సింగ్ సచిన్‌కు జీవిత ఖైదు, రూ. 25,000 జరిమానా విధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Maharashtra: ఫోన్ చూసుకుంటూ వచ్చిన తండ్రి.. నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన తండ్రి.. ఎక్కడ? (video)