Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో దీపావళి.. వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు.. ఎందుకు?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (17:16 IST)
దీపావళి పర్వదినం వస్తేనే.. అందరూ ఎగిరిగంతేస్తారు. కానీ దేశ రాజధాని ఢిల్లీ వాసులు మాత్రం వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? దీపావళికి తర్వాత ఓ పదిరోజుల తర్వాత.. ఆ రాష్ట్రంలో అత్యంత విషపూరిత వాయువులు మరింత వ్యాపిస్తాయని తెలుస్తోంది.
 
గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో విష వాయువులు అధికంగా వ్యాపిస్తుండడం.. కాలుష్యం అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా.. వాయు కాలుష్యం భూతంగా మారిపోతోంది.

దీనికి తోడు టపాకాయల్ని దీపావళికి కాల్చడంతో ఏర్పడే కాలుష్యంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం వున్నట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
దీపావళి రోజు టపాకాయలు కాల్చడానికి కేవలం రెండు గంటలు మాత్రమే సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినప్పటికి ... ఆ రెండు గంటలు కూడా ఎంతటి ప్రమాదానికి కారణం అవుతుందోనని ఢిల్లీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి పలు సూచనలు చేసింది. నిర్మాణ పనులు, విద్యుత్ రంగానికి సంబంధించిన పనులను బ్యాన్ చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments