Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో డేంజర్ బెల్స్... బాణసంచా కాల్చడం వల్లే...

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (15:45 IST)
ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫరీదాబాద్‌లో 454గా, గ్రేటర్ నోయిడాలో 410గా, ఘజియాబాద్‌లో 438గా, గుర్గావ్‌లో 473గా నమోదైంది.
 
గాలి నాణ్యత ఇంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)జీరో నుంచి 50 వరకు ఉంటే.. అక్కడ గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు. 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరంగా ఉందని,101-200 వరకు ఉంటే ఓ మోస్తరుగా ఉన్నట్లు పరిగణిస్తారు.
 
దీపావళి రోజు బాణసంచా కాల్చడంపై ప్రభుత్వ నిషేధం విధించినా ప్రజలు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. శుక్రవారం (నవంబర్ 5) తెల్లవారుజామున దట్టమైన పొగ నగరాన్ని ఆవరించింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ, వెదర్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఉదయం 8గంటల సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా నమోదైంది.
 
ప్రజలు బాణసంచా కాల్చడం, బయో మాస్ కాలుష్య కారకాలే ఇందుకు కారణమన్నారు. అయితే వాయు వేగం పెరిగితే ఇప్పుడున్న పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుందన్నారు భారత వాతావరణ శాఖ(IMD)అధికారి ఆర్కే జనమణి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments