Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపిన్ రావత్ మృతిపై నివేదిక: రక్షణ మంత్రికి ప్రజెంటేషన్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (13:15 IST)
భారత వైమానిక దళం నేతృత్వంలోని ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్న ట్రై-సర్వీసెస్ దర్యాప్తు బృందం బుధవారం రక్షణ మంత్రికి ప్రజెంటేషన్ చేసి తన నివేదికను సమర్పించనుంది. డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో పాటు మ‌రో 12 మంది ఇతర సైనికులు అమరులయ్యారు. ఘ‌ట‌న తర్వాత వైమానిక దళం దర్యాప్తుకు ఆదేశించింది. ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందంలో ఆర్మీ, నేవీకి చెందిన ఇద్దరు బ్రిగేడియర్ ర్యాంక్ అధికారులు ఉన్నారు.
 
ఇక‌ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన తర్వాత.. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. బ్లాక్‌బాక్స్‌ని, ఫ్లైట్ డేటా రికార్డర్ అని కూడా అంటారు. బ్లాక్ బాక్స్ లభించిన నేప‌థ్యంలో ఈ కేసులో కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  
 
భారత వైమానిక దళ ఉన్నతాధికారులతో పాటు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్న‌తాధికారులు కూడా పాల్గొంటారని రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. సీనియర్ అధికారులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని కూడా సవరించాలని ట్రై-సర్వీస్ బృందం సిఫారసు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments