Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సొంత వ్యాఖ్యలే నన్ను గాయపరుస్తున్నాయి. : ఉమాభారతి

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:37 IST)
ప్రభుత్వ అధికార వ్యవస్థ ఓ మిథ్య.. అధికారులు ఉన్నది రాజకీయ నేతల చెప్పులు మోయడానికేనంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. 
 
ఈ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధపెట్టాయన్నారు. తాను అలా మాట్లాడి ఉండాల్సిందికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు లేఖ రాసిన ఉమాభారతి.. తాను వాడే భాషను మరింతగా మెరుగుపరుచుకుంటానని హామీ ఇచ్చారు. 
 
శనివారం కొందరు ఓబీసీ నేతలు భోపాల్‌లో తన నివాసానికి వచ్చి కలిసిన సందర్భంగా బ్యూరోక్రసీపై ఉమాభారతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోమవారం సామాజిక మాధ్యల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 
 
దీనిపై కాంగ్రెస్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ తీవ్రంగా స్పందించారు. ఆ భాష తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇందుకుగాను ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో మంగళవారం ఉమాభారతి దిగ్విజయ్‌ సింగ్‌కు లేఖ రాశారు. 
 
'నా సొంత వ్యాఖ్యలే నన్ను గాయపరుస్తున్నాయి. తీవ్ర పదజాలం వాడొద్దని నేను మీకు పదేపదే చెప్పేదాన్ని. ఇప్పట్నుంచి నేను నా భాషను మెరుగుపరుచుకుంటాను. మీరూ అలా చేయగలిగితే చేయండి' అని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments