Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి సీఎం జగన్ మద్దతు.. రాజకీయాలొద్దంటూ..?

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (21:12 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ప్రధానిపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరమూ అండగా ఉందామని ట్విట్టర్ వేదికగా జగన్ పిలుపునిచ్చారు.
 
కేంద్రానికి సహకరించాల్సిన తరుణంలో వేలెత్తిచూపడం తగదని హితవు పలికారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తే దేశం బలహీనమవుతుందని పేర్కొన్నారు. సీఎం సోరెన్ అంటే తనకెంతో గౌరవమని, కరోనా సమయంలో రాజకీయాలు తగవని జగన్ సూచించారు. 

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా రాష్ట్ర పరిస్థితులను తెలుసుకోడానికి ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా ఫోన్ చేశారు. రాష్ట్ర పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత సీఎం సోరెన్ ట్వీట్ చేశారు.
 
''ఈ రోజు ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాటనే చెప్పారు. కట్టడికి ఏం చేయాలో చెబితే బాగుండేది. మా మాట కూడా వింటే బాగుండేది.'' అంటూ సోరెన్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments