Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరివి పెట్టిన తరువాత పాడె మీద నుంచి లేచిన శవం, పరుగులు తీశారు

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (17:27 IST)
చనిపోయిన వ్యక్తి బతకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి.. ఒడిస్సా రాష్ట్రం గంజా జిల్లా లావుగా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కొరివి పెట్టే సమయంలో పాడె మీద నుంచి శవం పైకి లేవడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... మల్లిక్ మేకలను మేపేందుకు అడవికి వెళ్ళేవాడు. గత రెండు సంవత్సరాలుగా అతను ఇదే పని చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో మల్లిక్ బాధపడ్డాడు. అయినా సరే అటవీ ప్రాంతంలోకి మేకలను తీసుకెళ్ళాడు. రాత్రివేళ అయ్యింది. సాయత్రం 6 గంటలకల్లా ప్రతిరోజు మల్లిక్ ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఎంతకూ రాకపోవడంతో బంధువులు హైరానా పడి అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు.
 
మల్లిక్ అటవీ ప్రాంతంలో ఓ చోట పడిపోయి ఉన్నాడు. శ్వాస వుందో లేదో అని పరిశీలించారు. అతడు శ్వాస తీసుకోవడంలేదు. దీంతో అతడు చనిపోయాడనుకున్నారు. బంధువులందరినీ పిలిచారు. పాడె సిద్ధం చేసి కుటుంబ సభ్యులందరూ స్మశాన వాటికకు తీసుకెళ్ళారు. కట్టెలు పెట్టి మల్లిక్‌ను పడుకోబెట్టి కొరివి పెట్టారు. అగ్గి పైకి లేవగానే దానితో పాటు మల్లిక్ కూడా పైకి లేచి కూర్చున్నాడు.
 
కిందకు దూకేశాడు. బంధువులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గ్రామస్తులైతే భయంతో పరుగులు తీశారు. విషయం అలా అలా బయటకు వెళ్ళడంతో మల్లిక్‌ను చూసేందుకు 45 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments