కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దు.. గాంధీ కుటుంబేతర వ్యక్తికి ఇవ్వండి .. రాహుల్

Webdunia
శనివారం, 25 మే 2019 (17:48 IST)
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, సీడబ్ల్యూసీ మాత్రం ఆయన రాజీనామా లేఖను తోసిపుచ్చింది. 
 
ఈ నెల 23వ తేదీన వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఆత్మపరిశీలనలో మునిగితేలుతోంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఇప్పటికే అనేక మంది రాజీనామాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాగా, ఇందులో రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను సమర్పించారు. 
 
ఇందులో రాహుల్ మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరవైఫల్యానికి కారణం తనదేనని చెప్పారు. అందుకే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ రాజీనామాను తిరస్కరించింది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోవడం పట్ల తనదే నైతిక బాధ్యత అని రాహుల్ చెప్పడంతో మిగిలిన సభ్యులు దాన్ని తోసిపుచ్చారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షపదవిని గాంధీ కుటుంబేతర వ్యక్తికి ఇవ్వాలని రాహుల్ చేసిన ప్రతిపాదనను కూడా సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. 
 
కాగా, ఈ సమావేశానికి యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments