Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారణాసిలో నరేంద్ర మోడీ... వాయనాడ్‌లో రాహుల్ గాంధీ విజయం

Advertiesment
వారణాసిలో నరేంద్ర మోడీ... వాయనాడ్‌లో రాహుల్ గాంధీ విజయం
, గురువారం, 23 మే 2019 (16:28 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్‌కు అనుగుణంగానే వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మరోమారు అధికారంలోకి రానుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ మరో ఐదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉండనుంది. ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు బీజేపీ కూటమి 130 సీట్లలో గెలుపొందగా, మరో 216 సీట్లలో ఆదిక్యంలో ఉంది. అలాగే, యూపీఏ కూటమి 30 సీట్లలో విజయం సాధించగా, 54 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 19 చోట్ల విజయం సాధించగా 93 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
 
ఇదిలావుంటే, వారణానిసి నుంచి పోటీ చేసిన నరేంద్ర మోడీ మరోమారు విజయభేరీ మోగించారు. ఈయన ఈ స్థానం నుంచి 3.50 లక్షల పైచిలుకు ఓట్లు మెజాట్తీ విజయబావుటా ఎగురవేశారు. గత 2014 ఎన్నకల్లో కూడా మోడీ ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెల్సిందే.
 
తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. కాగా.. ఈ నెల 26న మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో భాజపా ప్రభంజనంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. "సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌" కలిస్తే విజయీ భారత్‌ అని మోడీ ట్విటర్‌ ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. 
 
అలాగే, కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ సుమారుగా 8 లక్షల ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
మరోవైపు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా వెనుకంజలో ఉన్నారు. మూడో రౌండ్‌ ముగిసేసరికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పవన్‌ మూడో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం. ఇక్కడ వైకాపా ముందంజలో ఉండగా.. తెదేపా రెండో స్థానంలో కొనసాగుతోంది. 
 
అలాగే, పవన్‌ పోటీ చేసిన మరో నియోజకవర్గం విశాఖ జిల్లా గాజువాకలోనూ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ ఐదో రౌండ్‌ ముగిసేసరికి.. వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి.. పవన్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Assembly 2019 Live results - YSRCP -110 / TDP-24, వైసీపీ 37 విజయం