Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అధ్యక్ష పాలనకు ఛాన్స్ లేదు : డి రాజా

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:26 IST)
దేశంలో ప్రెసిడెంట్ పాలన వచ్చే అవకాశం లేదనీ, భారత రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పారు ప్రెసిడెంట్ పరిపాలన మన రాజ్యాంగ విధానం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో అధ్యక్ష పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
 
వీటిపై డి. రాజా స్పందిస్తూ, బీజేపీ తన పార్టీ హయాంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకువచ్చింది. నీతి ఆయోగ్ ద్వారా జరిగిన ప్రయోజనం కంటే రాజ్యాంగ దుర్వినియోగం జరిగింది. భారతదేశ ఆర్ధిక పరిస్థితులు పూర్తిగా విఫలమైంది నీతి ఆయోగ్ కారణంగానే. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలుగా మారే దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
 
మోడీ ప్రభుత్వం సబకా సాత్ సబకా వికాస్ మరియు ఇప్పుడు కొత్తగా సబకా విశ్వాస్ కానీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజలను మభ్యపెడుతున్నాయని చెప్పవచ్చును. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగ సమస్య జఠిలంగా మారింది. నగదు రద్దు వలన సమాన్యమానవుని జీవితం దుర్భరంగా మారింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో బీజేపీ పాలన పూర్తిగా ప్రజలకు దూరమైపోయింది. రిజర్వేషన్లు విషయంలో బీజేపీ తీరు ఇప్పటివరకు స్పష్టంగా ఒక నిర్ణయాన్ని వెలువరించలేకపోయింది.
 
కాశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉంది. తాను, సీతారాం ఏచూరి కాశ్మీర్ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వెళ్లలేకపోయాము.  ఆర్టికల్ 370 రద్దు అత్యంత దారుణమైన నిర్ణయం. ట్రంప్ మధ్యవర్తిత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మోడీ ఆమోదించడానికి అవకాశం ఉంది. కాశ్మీర్ ప్రజల కష్టాలను తెచ్చిపెడుతోంది. ఆర్టికల్ 370 రద్దు వలన అక్కడి ప్రజలకు సాంకేతిక సమస్యలు, సామాజిక వ్యవస్థ అర్ధరహితంగా మారింది.
 
బీఎస్పీ చీఫ్ మాయావతి అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తామని చెప్తూ ఇపుడు ప్రభుత్వ చర్యలను సమర్ధించడం శోచనీయం. జవహర్ లాల్ నెహ్రు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఈ రద్దు వెనుక రాజ్యాంగ ఉల్లంఘన చేసిన బీజేపీ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. మాయావతి బీజేపీని సపోర్ట్ చేస్తున్నట్లైతే మాకు అభ్యంతరం లేదు కానీ ప్రతిపక్షాలను కాశ్మీర్ వెళ్లవద్దని చెప్పటం హేయమైన చర్య. మా పార్టీకి నిర్ణయాత్మక వ్యూహం ప్రకారం నడుచుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments