Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లవ్ ఆర్ట్ డేటింగ్ పేరిట ఘరానా మోసం.. కిలేడీని పట్టేసిన పోలీసులు

Advertiesment
Online Dating Site
, మంగళవారం, 27 ఆగస్టు 2019 (09:14 IST)
లవ్ ఆర్ట్ డేటింగ్ పేరిట ఘరానా మోసానికి పాల్పడిన ఓ లేడీని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగించిన ఈ కిలేడీ అనేక మంది నుంచి రూ.8 కోట్ల మేరకు మోసం చేసినట్టు తేలింది. ఆమె చేతిలో పలువురు యువకులు, పెళ్లయిన పురుషులు కూడా మోసపోయారు. ఆమెను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాకు చెందిన అంబాసుర్, ఇమ్రాన్‌లను కలుపుకున్న సోమా సర్కార్, 'లవ్‌ ఆర్ట్‌ డేటింగ్‌' పేరిట వెబ్‌‌సైట్‌‌ను రెండేళ్ల నుంచి నడిపిస్తోంది. ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, 20 మంది అమ్మాయిలను నియమించుకుని, వారితో దందా సాగించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.1,025, ఆపై ప్యాకేజీల ఆధారంగా రూ.18,000 వరకూ వసూలు చేసేది. 
 
"నెలకు కేవలం రూ.1,025 మాత్రమే. అందమైన అమ్మాయిలు మీ ఊరిలోనే ఉన్నారు. వారితో కావాలంటే మాట్లాడండి. వారు ఇష్టపడితే డేటింగ్‌కు వెళ్లండి. ఎంత కాలానికైనా ప్యాకేజీలున్నాయి.. అంటూ ఓ ఆకర్షణీయమైన ప్రకటనతో అనేక మందిని మోసంచేసింది. 
 
కేవలం మాటలతో సరిపెట్టుకుంటామంటే, ఓ అమ్మాయి రోజుకు గంట పాటు కబుర్లు చెబుతుంది. ఇక డేటింగ్ కావాలంటే, మరింత డబ్బు తీసుకుని అమ్మాయిల ఫోటోలు, వివరాలు అంటూ చూపిస్తారు. ఆపై సోమా కాల్‌ సెంటర్‌‌లో పనిచేసే అమ్మాయిలే, అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండేవారు. డేటింగ్ చేద్దామని ఆశపడే అబ్బాయిలే వీరి టార్గెట్.
 
వారి ఫోటోలు, అడ్రస్, ఫోన్ నంబర్లు సేకరించే ఈ టీమ్, ఇతర డేటింగ్ సైట్లలో వాటిని ఉంచి పరువు తీసేది. ఆపై బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. మీ ఫొటోలు ఫలానా వెబ్‌‌సైట్‌లో ఉన్నాయని, అనైతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నందున కోల్‌‌కతాలో కేసు నమోదైందని బెదిరిస్తారు. అరెస్టు కాకుండా ఉండేందుకు డబ్బు కట్టాలని చెప్పి, వారి నుంచి డబ్బు వసూలు చేస్తారు. ఇలా ఎంతో మందిని నమ్మించి దాదాపు రూ.8 కోట్లు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెనుతుఫానుపై అణుబాంబు ప్రయోగిస్తే?.. డొనాల్డ్‌ట్రంప్‌