Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిక్కుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్‌... ఈడీ నోటీసులు జారీ

Advertiesment
చిక్కుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్‌... ఈడీ నోటీసులు జారీ
, బుధవారం, 10 జులై 2019 (14:17 IST)
టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం "ఘటోత్కచుడు". ఇందులో రీతుపర్ణ సేన్‌గుప్తా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆమెకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేశారు.
 
దీనికి కారణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రోజ్‌ వ్యాలీ స్కామ్‌లో ఆమె పేరు రావడమే. ఇప్పటికే ఈ స్కామ్ ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్జీత్ ఛటర్జీతో పాటు.. పలువురు నటీనటులు, ప్రముఖులకు ఈడీ తాఖీదులు పంపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రీతుపర్ణసేన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రవాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రాగల 24 గంటల్లో' విప్పి చూపిస్తానంటున్న ఈషా రెబ్బా