Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి : ఉత్తరాఖండ్

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:23 IST)
ఆ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. నిజానికి ఇటీవల తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండుంటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. 
 
ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్‌ను అమలు చేస్తోంది. అలాగే, కఠినమైన ఆంక్షలను విధించింది. పెరుగుతున్న కేసుల మధ్య ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కూడా ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లను అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇత‌ర రాష్ట్రాల నుంచి త‌మ రాష్ట్రానికి వ‌చ్చే ప్ర‌యాణికులు, ప‌ర్యాట‌కుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది.
 
ప్రధానంగా మహారాష్ట్ర, గుజ‌రాత్‌, కేర‌ళ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గఘఢ్ రాష్ట్రాల నుంచి ఉత్తరఖండ్‌కు వ‌చ్చే ప్ర‌యాణికులు, ప‌ర్యాట‌కుల‌ు త‌ప్ప‌నిస‌రిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. 
 
రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌తో పాటు అన్ని రైల్వేస్టేష‌న్లు, డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టులో క‌రోనా టెస్టు సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఈ కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments