Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నలుగురు భార్యలతో సంసారం.. లాక్‌డౌన్‌ను అలా ఉపయోగించుకున్నాడు..

Advertiesment
నలుగురు భార్యలతో సంసారం.. లాక్‌డౌన్‌ను అలా ఉపయోగించుకున్నాడు..
, శనివారం, 20 ఫిబ్రవరి 2021 (23:45 IST)
ఒడిస్సాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనా లాక్ డౌన్‌ను బాగా ఉపయోగించుకున్నాడు. నలుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. అదీ ఒక పెళ్లికి మరో పెళ్లికి తొమ్మిది నెలల వ్యత్యాసంలో వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్డౌన్‌ను ఈ వ్యక్తి సరిగ్గా ఉపయోగించుకున్నాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం ఒడిస్సాలో సంచలనంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిస్సా గవర్నమెంట్ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల వ్యక్తి.. నలుగురిని పెళ్లాడాడు. నలుగురు భార్యలతో సంసారం చేశాడు. విడాకులు తీసుకోకుండానే నలుగురు జీవితాల్లో ఆడుకున్నాడు. 
 
అయితే తొలి భార్య ఈ విషయాన్ని కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న కటక్ పోలీసులు 45 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో టీచర్ అయిన ఆ వ్యక్తి 2001లో తొలిసారి వివాహం చేసుకున్నాడని.. ఎనిమిదేళ్ల తర్వాత.. మూడేళ్ల పాటు రెండో భార్యతో గడిపాడు. 
 
ఆమె దగ్గర నగలను దోచుకుని.. ఆపై మరో ఇద్దరిని పెళ్లాడాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై 2021 జనవరిలో ఫిర్యాదులు అందాయని.. దర్యాప్తులో నలుగురు మహిళలను టీచర్‌గా పనిచేసే నిందితుడు మోసం చేసినట్లు తేలింది. ఆపై ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటర్ లిస్టులో సినీ నటుడు వెంకటేష్ ఫోటో