భర్తతో గొడవలు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. అభశుభం తెలియని పది నెలల చిన్నారి ప్రాణాలను తీసేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా కొడుకు అడ్డుగా ఉన్నాడని అతి కిరాతకంగా ప్రియుడి దగ్గర చంపించి ఏమీ ఎరుగనట్లు పుట్టింటికి వెళ్ళింది.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	నల్గొండ జిల్లా నకిరేకల్ పరిధిలోని శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో సంతోష, రామక్రిష్ణలు నివాసముంటున్నారు. వీరికి ఆరేళ్ళ క్రితం వివాహమైంది. మూడు సంవత్సరాల కూతురు.. పదినెలల కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో భర్తతో విభేదించి పుట్టింటికి వచ్చేసింది సంతోష. 
 
									
										
								
																	
	 
	రామన్నగూడెం గ్రామంలో సంతోష పుట్టిల్లు. ఇంటి పక్కనే బాలకిషన్ అనే వ్యక్తి ఉండేవాడు. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతున్నాడు. ఆ యువకుడితో సంతోష కనెక్టయ్యింది. సంబంధం పెట్టేసుకుంది. నిన్ను పెళ్ళి చేసుకుని కొత్త జీవితం ఇస్తానని వివాహితను బాగా నమ్మించాడు యువకుడు.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	దీంతో కూతురిని ఇంట్లోనే వదిలి మూడురోజుల క్రితం పది నెలల కొడుకుతో ఇంటి నుంచి పారిపోయింది సంతోష. అయితే నిన్న ఉన్నట్లుండి పుట్టింటికి తిరిగివచ్చింది. కొడుకు మూర్చతో చనిపోయాడని ఇంట్లో తల్లిదండ్రులకు తెలిపింది. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషను చితకబాదారు.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	దీంతో అసలు విషయం చెప్పేసింది. బాలకిషన్‌తో కలిసి బిడ్డను చంపేశానని చెప్పింది. దీంతో గ్రామస్తులు సంతోషను చావబాది పోలీసులకు అప్పగించారు. బాలకిషన్ పరారీలో ఉన్నాడు. అక్రమ సంబంధానికి అభంశుభం తెలియని పదినెలల చిన్నారి చనిపోవడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుమకున్నాయి. బాలకిషన్ కోసం వెతుకుతున్నారు.