Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా టీచర్‌ను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి అర్థనగ్నంగా...

Advertiesment
మహిళా టీచర్‌ను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి అర్థనగ్నంగా...
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాదులో దారుణం చోటుచేసుకుంది. పైపట్‌పురా గ్రామంలోని శివారు పొలాల్లో అర్థనగ్నంగా పడి వున్న మహిళ శవం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు. హత్య గావింపపడిన మహిళ ప్రైవేటు ఉపాధ్యాయురాలుగా గుర్తించారు. శనివారం నాడు ట్యూషన్ చెప్పేందుకు బయటకు వెళ్లిన ఉపాధ్యాయురాలు తిరిగి ఇంటికి రాలేదు. దీనితో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈలోగా గ్రామంలోని శివారు ప్రాంతంలో అర్ధనగ్నంగా గుర్తు తెలియని మహిళ మృతదేహం వుందని పోలీసులకు సమాచారం అందింది.
 
మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించారు. అక్కడ కొంత పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో టీచర్ పైన కొందరు దాడి చేసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి ఆ తర్వాత హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోస పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం - 22 మంది దుర్మరణం