Publish Date: Mon, 22 Feb 2021 (11:43 IST)
Updated Date: Mon, 22 Feb 2021 (11:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,97,712కి చేరింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,625కి చేరింది.
కరోనా బారి నుంచి ఆదివారం 143 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,94,386కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701 ఉండగా.. వీరిలో 645 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 24 కేసులు నమోదయ్యాయి.