Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భస్థ శిశువును కూడా వదిలిపెట్టని కరోనా మహమ్మారి..

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:51 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కడుపులో వున్న గర్భస్థ శిశువును కూడా కరోనా వదల్లేదు. తల్లి నుండి కడుపులో ఉన్న బిడ్డకు కూడా కరోనా మహమ్మారి సోకింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఇప్పటిదాకా తల్లి కడుపులోని బిడ్డకు కరోనా సోకదని చాలా మంది నిపుణులు చెప్తూ వున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో నిపుణులు కూడా షాక్ అవుతూ ఉన్నారు.
 
కరోనా పాజిటివ్ ఉన్న ఓ మహిళ కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. తొలుత ఆమె భర్తకు కరోనా పాజిటివ్ రాగా.. ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెకూ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు రావడంతో పలు ఆసుపత్రులకు తిరిగారు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆమెను చేర్చుకునేందుకు అంగీకరించలేదు.
 
ఆయుష్మాన్ భవ్ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకుని ప్రసవం చేసింది. తర్వాత పుట్టిన బిడ్డకూ కరోనా ఉన్నట్టు గుర్తించి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా అరుదు అని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments