Webdunia - Bharat's app for daily news and videos

Install App

తబ్లీగి వర్కర్ల ద్వారానే వేలాది మందికి వైరస్ సోకింది : కేంద్రం

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (10:30 IST)
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మత సమ్మేళనానికి హాజరైన తబ్లీగి వర్కర్లు విదేశీ ప్రతినిధుల నుంచి కరోనా అంటించుకున్నారనీ, వీరిద్వారా ఏకంగా 20వేల మందిలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో వారందరినీ పట్టుకుని కరోనా పరీక్షలు చేస్తున్నట్టు పేర్కొంది. 
 
ఇప్పటివరకు పట్టుకున్న వారికి కరోనా పరీక్షలు చేస్తున్నామని, వారిలో ఇప్పటివరకు 1023 మందికి పాజిటివ్‌ వచ్చినట్లుగా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరంతా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు చెప్పింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 2902 కాగా, అందులో తబ్లీగీ జమాత్‌ వాటాయే 30 శాతంగా ఉందని తెలిపింది. 
 
ఇకపోతే, రాజస్థాన్‌ రాష్ట్రంలో 5 జిల్లాల్లో 5 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ ఐదుగురూ ఢిల్లీకి వచ్చిన వారేనని పేర్కొంది. అలాగే, యూపీలోని ముజఫర్‌నగర్‌లో పోలీసులపై దాడికి ఉసిగొల్పిన వ్యక్తి జాడ చెప్పిన వారికి రూ.25 వేలు ఇస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments