దేశంలో 10 వేలు దాటిన కరోనా కేసులు - ఒక్కో రాష్ట్రంలో ఎన్నెన్ని?

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:19 IST)
దేశంలో కరోనా కేసులు పదివేలు దాటిపోయాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 1,244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,363కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను మంగళవారం వెల్లడించింది. ఇదేసమయంలో ఇప్పటివరకూ 339 మంది మరణించారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 1,035 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.
 
ఇకపోతే, రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే, మహారాష్ట్రలో అత్యధికంగా 2334 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 1510 కేసులు, తమిళనాడులో 1173 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 50 శాతం నమోదుకావడం ఇపుడు ఆయా రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 873, మధ్య ప్రదేశ్‌లో 604, తెలంగాణలో 562, ఉత్తర ప్రదేశ్‌లో 558, గుజరాత్‌లో 539 కేసులు వచ్చాయి. 
 
మిగతా రాష్ట్రాల్లోని కేసులను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 432, అండమాన్ దీవుల్లో 11, అసోంలో 31, బీహారులో 65, చండీగడ్‌లో 21, చత్తీస్‌గఢ్‌లో 31, గోవాలో 7, గుజరాత్‌లో 539, హర్యానాలో 185, హిమాచల్ ప్రదేశ్‌లో 32, జమ్మూకాశ్మీర్‌లో 270 కేసులు నమోదయ్యాయి.
 
ఇక ఝార్ఖండ్‌లో 24, కర్ణాటకలో 247, కేరళలో 379, లడఖ్‌లో 15, మణిపూర్‌లో 2, ఒడిశాలో 54, పుదుచ్చేరిలో 7, పంజాబ్‌లో 167, త్రిపురలో 2, ఉత్తరాఖండ్‌లో 35, పశ్చిమ బెంగాల్‌లో 190 కేసులు నమోదు కాగా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
 
అలాగే, దేశంలో సంభవించిన కరోనా మరణాల సంఖ్య 339గా ఉంది. వీటిలో దాదాపు సగం... అంటే 160 మంది ఒక్క మహారాష్ట్రలోనే చనిపోయారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో 43, ఢిల్లీలో 28 మంది, గుజరాత్‌లో 26 మంది మరణించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకూ దేశంలో 2 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments