Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌కు మరో దెబ్బ... 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది జంప్

Webdunia
గురువారం, 11 జులై 2019 (09:19 IST)
కాంగ్రెస్ పార్టీకి దెబ్బపై దెబ్బ తగులుతోంది. గోవా రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన 15 మంది శాసనసభ్యుల్లో 10 మంది పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరంతా బీజేపీలో చేరారు. పైగా, తమను బీజేపీలో విలీనం చేసుకోవాల్సిందిగా వారు కోరగా, వెంటనే విలీన ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్  సావంత్ వెల్లడించారు. 
 
గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉండగా, ఇందులో బీజేపీకి 17 మంది, కాంగ్రెస్ పార్టీకి 15, గోవా ఫార్వార్డ్ పార్టీకి 3, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి 1, ఎన్సీపీకి 2, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది శాసనసభ్యుల్లో పది మంది బీజేపీలో చేరిపోయారు. దీంతో గోవాలో కాంగ్రెస్ పార్టీ బలం ఐదుకు పడిపోయింది. 
 
నిజానకి కర్నాటక సంక్షోభంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో గోవాలో పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పైగా, తమను బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్ రాజేశ్‌ పట్నేకర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు విలీనానికి సై అనడంతో కాంగ్రెస్  శాసనసభా పక్షం బీజేపీలో విలీనమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments