Webdunia - Bharat's app for daily news and videos

Install App

23తో కుమార స్వామి సర్కారు ఉండదు : బీజేపీ నేత సదానంద గౌడ

Webdunia
గురువారం, 23 మే 2019 (07:48 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారు ఉండబోదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ జోస్యం చెప్పారు. ప్రస్తుతం, జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసివున్నాయి. 
 
అయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ - జేడీఎస్ సర్కార్ కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్ బేగ్ సహా మరికొందరు కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 
 
ఈ పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం కుప్పకూలుతుందని వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సిద్ధమైందని చెప్పారు. 
 
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం స్థిరత్వంపై ప్రభావం చూపిస్తాయని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాధారణ మెజార్టీకి నాలుగైదు సీట్లు అధికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కర్ణాటక ప్రభుత్వాలను కూల్చి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
 
అందువల్ల సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపొచ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడమో లేదా నయానో భయానో బెదిరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫలితంగా అటు మధ్యప్రదేశ్, ఇటు కర్ణాటక రాష్ట్రాల్లో అధికారపక్షం నేతల్లో గుబులు పుడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

Rishab Shetty: రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ డేట్ ఫిక్స్

Arjun: యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల మఫ్తీ పోలీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments