Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరపైకి సెక్యులర్ డెమొక్రటిక్ ఫ్రంట్... హంగ్ వస్తే కింగ్...

తెరపైకి సెక్యులర్ డెమొక్రటిక్ ఫ్రంట్... హంగ్ వస్తే కింగ్...
, గురువారం, 23 మే 2019 (07:27 IST)
దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ ఏర్పాటుకానుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించనుంది. గురువారం వెల్లడయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేనందున యూపీఎ పక్షాలతోపాటు మిగిలిన పార్టీలు కలిసి కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ కూటమిలో యూపీఏ భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ఉంటాయి. కొత్తగా మరికొన్ని పార్టీలతో కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేయనున్నాయి.
 
ప్రస్తుతానికి ఆ ఫ్రంట్‌కు సెక్యూలర్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రాదని విపక్ష నేతలు భావిస్తున్నారు. దీంతో యూపీఏలోని ఆరు పార్టీలతో పాటు తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌, బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం పార్టీతో పాటు వామపక్షాలు కలిసి ఈ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.
 
ఇదిలావుంటే, కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడటం తథ్యమని విపక్ష పార్టీలన్ని గట్టిగా విశ్వసిస్తున్నాయి. దీంతో ఢిల్లీలో విపక్ష నేతలంతా భేటీకానున్నారు. యూపీఏతో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీలను ఈ భేటీకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో ఈ కొత్త కూటమి తొలిసారి ఢిల్లీలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
 
ఈ సమావేశానికి తెరాసతో పాటు వైకాపా నేతలకు కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. హంగ్‌ వచ్చే పక్షంలో అతి పెద్దగా కూటమిగా ఏర్పడి... ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ ఇవ్వాలని విపక్ష నేతలు భావిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై ఓ అంచనా ఏర్పడుతుందని, హంగ్‌కు ఛాన్స్‌ ఉండే పక్షంలో గురువారం రాత్రికి ఢిల్లీలో విపక్షాల భేటీ ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Verdict2019 : ఏపీలో గెలిచేది ఎవరు? ఓడిపోయేది ఎవరు?