ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (16:14 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కాంగ్రెస్ అధిష్టానంపై కీలక సూచన చేశారు. తన భవితవ్యంపై నాన్చుడి ధోరణి అవలంభించకుండా అటో ఇటో తేల్చాలని కోరారు. కర్నాటక రాష్ట్రంలో నవంబరు నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మరోమారు స్పందించారు. ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాలని, ఇందుకోసం అధిష్టానం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
 
2023లో జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ గద్దెనెక్కిన నాటి నుంచీ రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది. నవంబరు 20తో ఆ రెండున్నరేళ్ల గడువు ముగిసింది. దాంతో కర్ణాటక రాజకీయాలు వేడేక్కాయి. ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని ఒకవైపు డీకే చెప్తున్నా.. మరోవైపు సీఎం పదవిపై ఆశను పరోక్షంగా వ్యక్తంచేస్తున్నారు. 
 
కర్ణాటక రాజకీయాల్లో మరికొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఇంకోవైపు విపక్ష నేతలు జోస్యం చెప్తున్నారు. 'కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా తీవ్ర గందరగోళంలో ఉంది. మరికొన్ని నెలల్లో అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చు' అని కేంద్ర మంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధూ స్పందన వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments