Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ విధించండి.. కేంద్రంపై ఒత్తిడి.. 24 గంటల్లో భారీగా కేసులు

Webdunia
మంగళవారం, 4 మే 2021 (15:34 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ పెరుగుతోంది. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే గడిచిన 24 గంటల్లో దేశంలో మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య సుమారు 50 దేశాలలో ఒక రోజులో కేసుల సంఖ్య కంటే ఎక్కువ. సెకండ్ వేవ్.. వేగంగా వ్యాప్తి చెందుతుండగా.. చైన్ బ్రేక్ చేయడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టాలని కోరుతున్నారు.
 
కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ కోసం పూర్తి లాక్‌డౌన్ అవసరంపై మరోసారి ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ డిమాండ్ పెరిగిపోతుంది. లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థ ఎలా కుప్పకూలిపోతుందో దేశం చూసింది, కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణాలు ముఖ్యం అంటూ.. పరిశ్రమల నుంచే ఈ డిమాండ్ ముందుగా వస్తుంది.
 
దేశంలోని అతిపెద్ద పరిశ్రమల ఛాంబర్, సిఐఐ, దేశంలో సామాన్య ప్రజల బాధలను తగ్గించడానికి ఆర్థిక కార్యకలాపాలను పెద్ద ఎత్తున పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని చిన్న వ్యాపారులు మరియు చిల్లర వ్యాపారుల సంస్థ అయిన CAIT ఇప్పటికే లాక్‌డౌన్‌కు మద్దతు ప్రకటించింది.
 
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) నిర్వహించిన ఒక సర్వేలో 67.5 శాతం మంది ప్రజలు గత సంవత్సరం మాదిరిగానే జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు. లాక్‌డౌన్ పెట్టకుండా కరోనా ఆగదని ప్రజలు నమ్ముతున్నారు.
 
ఈ సర్వేలో ఢిల్లీతో సహా.. దేశంలోని 9వేల 117 మంది తమ అభిప్రాయాన్ని తీసుకున్నట్లు క్యాట్ జాతీయ అధ్యక్షుడు బిసి భారతీయ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments