Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దారుణం... ప్రియురాలి సజీవదహనం

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (11:45 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో ఆమెను ముత్తు అనే వ్యక్తి బస్టాండ్‌లోనే సజీవ దహనం చేశాడు. చెన్నైలో రోజువారీ కార్మికుడైన ముత్తు.. శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరు బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపైనే జీవించేవారు. 
 
అయితే కోయంబేడు మార్కెట్‌లో పనిచేసే మరో వ్యక్తితో శాంతి సన్నిహితంగా ఉంటోంది. అది ఇష్టంలేని ముత్తు సదరు వ్యక్తితో తెగదెంపులు చేసుకోవాలని శాంతిని హెచ్చరించాడు. 
 
ఆమె వినకపోవడంతో కక్ష పెంచుకున్న ముత్తు.. శాంతి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ పోసి ఆమెకు నిప్పంటించాడు. అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రయాణికులు, స్థానికులు ఆ మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇరువురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments