చెన్నైలో దారుణం.. భార్యను కాపాడబోయి భర్త మృతి

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:04 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలో విషాదం నెలకొంది. భార్యను కాపాడబోయి భర్త మృతి చెందారు. రామనాథపురంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోగా గర్భిణి భార్యను కాపాడిన భర్త శిథిలాల్లో చిక్కుకుని మృతి చెందారు. రామనాథపురం ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన షణ్ముగరాజ్‌ (24), సంగీత భార్యాభర్తలు. భార్య నాలుగు నెలల గర్భిణి.
 
రామనాథపురంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. వర్షానికి షణ్ముగరాజ్‌ సహా ముగ్గురి పెంకుటిళ్లు హఠాత్తుగా కూలాయి. ఈ శబ్ధం విని పైకి లేచిన షణ్ముగరాజ్‌ భార్య సంగీతను ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు.
 
తను బయటకు వచ్చే లోపు ఇల్లు కప్పు కుప్పకూలింది. ఈ శిథిలాల్లో చిక్కుకుని షణ్ముగరాజ్‌ మృతి చెందారు. అతని మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments