Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్: ప్రాప్‌టైగర్‌ అధ్యయనం

హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్: ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
, సోమవారం, 11 జనవరి 2021 (19:45 IST)
రెండు త్రైమాసాలు స్తబ్దుగా ఉన్న గృహ మార్కెట్లు దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌‌లలో పునరుద్ధరించబడినట్లుగా కనిపిస్తుంది. నూతన ప్రారంభాలతో పాటుగా అమ్మకాల పరంగా కూడా వృద్ధి అక్టోబర్‌-డిసెంబర్‌ 2020 నడుమ కాలంలో కనిపించింది.
 
‘‘దక్షిణ భారతదేశపు మార్కెట్‌లలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో పునరుద్ధరణ అనేది కనిపిస్తుంది. దేశంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలలో 43% ఇక్కడే గత త్రైమాసంలో కనిపించడంతో పాటుగా మొత్తంమ్మీద అమ్మకాల పరంగా 29% వాటాను ఇదే కాలంలో ఈ నగరాలు ఆక్రమించాయి. ఈ మూడు నగరాలలోనూ అందుబాటులోని గృహాల విభాగం అగ్రస్ధానంలో కొనసాగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించవలసినది మాత్రం హైదరాబాద్‌ నగరాన్ని.
 
ఎందుకంటే మిగిలిన చాలా నగరాలలో తిరోగమన ధోరణి కొనసాగుతుంటే, ఈ నగరంలో మాత్రం ధరల వృద్ధి కనిపించింది. వాణిజ్య పరంగా ఈ నగరం సాధించిన వృద్ధితో పాటుగా హైదరాబాద్‌ యొక్క రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ తమ నూతన మరియు ప్రపంచశ్రేణి మౌలిక వసతుల ప్రాజెక్టుల కారణంగా ప్రయోజనం పొందింది. దీనికితోడు నివాసితులకు ఈ ప్రాజెక్టులు అందిస్తున్న జీవిత నాణ్యత కూడా కారణమే’’ అని మణి రంగరాజన్‌, గ్రూప్‌ సీఓఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
మొత్తంమ్మీద ఆవిష్కరణలలో 43% మూడు దక్షిణాది నగరాలలోనే జరిగాయి. ఈ త్రైమాసంలో అత్యధిక సంఖ్యలో యూనిట్లు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. జాతీయ ధోరణులకు ప్రతిబింబంగా నిలిచే ఈ మార్కెట్‌లో ప్రతి సంవత్సరం విలువ పెరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో అత్యధిక అమ్మకాలు భారతదేశపు ఇన్‌ఫర్మేషన్‌ రాజధాని బెంగళూరులో కనిపించాయి. సంయుక్తంగా ఈ మూడు నగరాలలోనూ డిసెంబర్‌ త్రైమాసంలో మొత్తంమ్మీద 43%నూతన ఆరంభాలు జరిగాయి. అదే సమయంలో జాతీయ అమ్మకాలలో 29% వాటాను ఈ మూడు నగరాలూ ఆక్రమించాయి.
 
2020 నాల్గవ త్రైమాసంలో నూతన ఆరంభాలు
బెంగళూరు- 6,104
చెన్నై- 4,887
హైదరాబాద్‌- 12,723
 
2020 నాల్గవ త్రైమాసంలో గృహ విక్రయాలు
బెంగళూరు- 7660
చెన్నై- 3180
హైదరాబాద్‌- 6,487
 
అమ్మకాలతో పాటుగా నూతన సరఫరా పరంగా, ఈ మూడు నగరాలలోనూ వృద్ధి అనేది జులై-సెప్టెంబర్‌ 2020 కాలంతో పోల్చినప్పుడు కనిపించింది. బెంగళూరులో, అందుబాటు ధరలలోని గృహ విభాగం (45 లక్షల రూపాయల లోపు యూనిట్లు) 27% ప్రారంభాలు మరియు 25% అమ్మకాలకు తోడ్పాటునందించాయి. చెన్నైలో ఈ విభాగం 38% ప్రారంభాలు మరియు 37% విక్రమాలకు తోడ్పాటునందిస్తే, హైదరాబాద్‌లో అది 33% ప్రారంభాలు మరియు 17% విక్రయాలకు తోడ్పాటునందించింది.
 
ఆఫీస్‌ కార్యకలాపాల పరంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో సరఫరా, డిమాండ్‌ పరంగా అత్యధిక వాటా కనిపించింది. చెన్నైలో మరోవైపు, చెన్నై పశ్చిమ ప్రాంతాలైన మొగాప్పియర్‌ మరియు పెరుంబాకమ్‌ మరియు ఓఆర్‌ఆర్‌పై వృద్ధి చెందుతున్న షోలింగానల్లూర్‌లలో అమ్మకాల పరంగా వృద్ధి చెందుతుంది. బెంగళూరులో, ఈ డిమాండ్‌ వర్తూర్‌, వైట్‌ఫీల్డ్‌, బెగూర్‌, బుడిగిరి మరియు కృష్ణ రాజపుర లలో నూతన సరఫరాను బెంగళూరు ఉత్తర భాగాలైన బుడిగిరి క్రాస్‌, కోగిలు, యెలంక వద్ద కూడా కనిపించింది.
 
దేశవ్యాప్తంగా చూసినప్పుడు హైదరాబాద్‌లో అతి తక్కువ ఇన్వెంటరీ కనిపించింది. డిసెంబర్‌ 21, 2020 నాటికి చెన్నైలో అతి తక్కువ అన్‌సోల్డ్‌ స్టాక్‌ ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా చూసినప్పుడు హైదరాబాద్‌లోనే అతి తక్కువ ఇన్వెంటరీ 29 నెలల కాలం వద్ద కనిపిస్తుంది. హైదరాబాద్‌లో అమ్ముడు కాకుండా ఉన్న ఇన్వెంటరీ ఈ త్రైమాసంలో గణనీయంగా 19% వృద్ధి చెందింది.  దీనికి నూతన సరఫరా ఒక్కసారిగా పెరగడమూ కారణమే. చెన్నైలో సైతం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌  అమ్ముడు కాకుండా ఉన్న ఇన్వెంటరీ 5% వృద్ధి చెందింది. బెంగళూరులో ఇది 11% తగ్గింది. ఇన్వెంటరీ ఓవర్‌ హ్యాంగ్‌ అనేది ప్రస్తుత స్టాక్‌ విక్రయానికి, ఈ సంవత్సర అమ్మకపు వేగం ఆధారంగా అమ్మకాలకు  పట్టే కాలంగా డెవలపర్లు అంచనా వేసే కాలం.
 
అమ్ముడు కాకుండా ఉన్న స్టాక్‌ నగర వ్యాప్త బ్రేకప్‌ విషయానికి వస్తే.. బెంగళూరులో డిసెంబర్‌ 31, 2020 నాటికి స్టాక్‌ 71,198 వుండగా ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌-36. చెన్నైలో డిసెంబర్‌ 31, 2020 నాటికి స్టాక్‌ 36,609 వుండగా ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ 42. హైదరాబాదులో డిసెంబర్‌ 31, 2020 నాటికి స్టాక్‌ 39,308 వుండగా ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ 29గా వుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 2019 నుంచి ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ అనేది వృద్ధి చెందుతూనే ఉంది. డిసెంబర్‌ 2019 చివరి నాటికి బెంగళూరులో ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ అనేది 25 నెలలుగా ఉంటే, చెన్నైలో 26 నెలలు, హైదరాబాద్‌లో 13 నెలలుగా ఉంది. డిమాండ్‌ తగ్గినప్పటికీ హైదరాబాద్‌లో ధరలు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి
 
దేశవ్యాప్తంగా డిమాండ్‌ నెమ్మదించడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ, నిజామ్‌ల నగరంలో మాత్రం ధరల పరంగా వృద్ధి కనిపిస్తోంది. నాల్గవ త్రైమాసంలో సైతం ఈ ఫార్మాస్యూటికల్‌ కేంద్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ధరలు 5% వృద్ధి చెందాయి. సరాసరి ధరలు స్థిరంగా వృద్ధి చెందడం వల్ల ఆస్తుల ధరలు హైదరాబాద్‌లో ప్రస్తుతం అధికంగానే ఉన్నాయి. బెంగళూరు, చెన్నైలలో సరాసరి విలువ 2% వృద్ధి చెందింది.
 
దక్షిణాది నగరాలలో రమారమి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్‌ నగరంలో డిసెంబర్‌ 31,2020నాటికి రమారమి ధరలు 5602 రూపాయలుగా వుంటే వార్షిక మార్పు 5%. బెంగళూరు నగరంలో 5,342 రూపాయలు వుంటే  వార్షిక మార్పు 2%. చెన్నై నగరంలో 5,228 రూపాయలుగా వుంటే వార్షిక మార్పు 2%.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు : హైకోర్టు ఆదేశం