Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటన్‌ రాజ దంపతులకు కరోనా టీకా.. బకింగ్‌హామ్ ప్యాలెస్

Advertiesment
బ్రిటన్‌ రాజ దంపతులకు కరోనా టీకా.. బకింగ్‌హామ్ ప్యాలెస్
, సోమవారం, 11 జనవరి 2021 (17:24 IST)
Queen Elizabeth
కరోనాకు టీకా ఇచ్చే ప్రక్రియ వేగవంతంగా మారుతోంది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగం కోసం ప్రముఖులు వాడుతున్నారు. తాజాగా బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌-2, రాజు ఫిలిప్‌కు కరోనా టీకా తీసుకున్నట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది.

99 ఏళ్ల ఫిలిప్‌,94 ఏళ్ల ఎలిజిబెత్‌కు వారి ఫ్యామిలీ డాక్టర్‌ విండ్‌సోర్‌ టీకాలు అందజేశారు. వ్యాక్సిన్‌పై వస్తున్న ఆపోహలు తొలగించేందుకు తాము వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న విషయాన్ని బహిరంగ పరచాలని రాణి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రకటన వెలువడింది. 
 
కాగా, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బ్రిటన్‌ రాజు, రాణి ఇదే ప్యాలెస్‌లో గడిపారు. అదే సమయంలో వీరి పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ వైరస్‌ బారిన పడ్డారు. మనవడు విలియమ్స్‌కు కూడా ఏప్రిల్‌లో కొవిడ్‌ పాజిటీవ్‌గా తేలింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. 
 
ఎలిజిబెత్‌, ఫిలిఫ్‌ క్రిస్మస్‌ను మాత్రం బెర్క్‌షైర్‌ రెసిడెన్సీలో జరుపుకొన్నారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 1.5 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. బ్రిటన్‌లో 80ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యతగా టీకాలు అందిస్తున్నారు. బ్రిటన్‌లో ఇప్పటికే మూడు సంస్థల కొవిడ్‌ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఫైజర్‌-బైయోఎన్‌ఎన్‌టెక్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా, మోడెర్నా టీకాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమెకు అబార్షన్ చేయండి.. వైద్యులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం