ఒంటరిగా వుండే మహిళలను టార్గెట్ చేస్తాడు. ఆపై వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు.. చివరికి జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఒంటరిగా కనిపించిన యువతులు, మహిళలపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడే నిందితుడు.. తాను పాల్పడే అత్యాచారాలను తన మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు తీసేవాడు. ఆపై వాటిని అత్యాచార బాధితుల వద్ద చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు.
ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు జరిపిన విచారణలో.. అతని మొబైల్ ఫోన్‌లో 50 మందికి పైగా మహిళలను అత్యాచారానికి పాల్పడిన వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.