జాబిల్లికి మరింత చేరువైన 'చంద్రయాన్-3' : కక్ష్యను కుదించిన ఇస్రో శాస్త్రవేత్తలు

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:07 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఇప్పటివరకు సాఫీగానే సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా, జాబిల్లికి చంద్రయాన్-3 మరింత చేరువైంది. ఆదివారం రాత్రి కక్ష్య కుదింపు చర్యను చేపట్టినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో జాబిల్లికి చంద్రయాన్ మరింత దగ్గరైందని, ఇదేవిధంగా కక్ష్య కుదింపు చర్యలు మరో రెండు ఉన్నాయని వారు వెల్లడించారు. అన్నీ సవ్యంగా సాగితే ఈ నెల 23వ తేదీన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లిపై దిగుతుందని వారు తెలిపారు.
 
కాగా, ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరయ్యేలా మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెడతామని వారు తెలిపారు. ఆ తర్వాత రెండు సార్లు కక్ష్య మార్పు కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఆఖరులో చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3ని చేర్చుతారు. 
 
ఆ పిమ్మట ఈ నెల 23వ తేదీన చంద్రుడిపై దించుతారు. చంద్రయాన్-3 వ్యోమనౌకను గత నెల నెలలో శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన విషయం తెల్సిందే. తొలుత భూమి చుట్టూ పరిభ్రమిస్తూ వేగం పుంజుకున్న వ్యోమనౌక శనివారం జాబిల్లి కక్ష్యలోకి తొలిసారిగా ప్రవేశించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments