Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రయాన్ -3: తదుపరి లక్ష్యం చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమే

Advertiesment
chandrayaan-3
, మంగళవారం, 1 ఆగస్టు 2023 (10:15 IST)
చంద్రయాన్ -3 జర్నీలో మరో కీలక ఘట్టం నమోదు కానుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. చంద్రయాన్-3 విజయవంతంగా భూ కక్ష్యలను పూర్తి చేసుకుని చంద్రుడివైపు వెళుతోందని ఇస్రో ప్రకటించింది. 
 
బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్కింగ్‌లో పేరిజీ-ఫైరింగ్ దశ పూర్తయింది. దీన్ని విజయవంతంగా ట్రాన్స్ లూనార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టామన్నారు. 
 
ఇక.. తదుపరి లక్ష్యం చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమేనని ఇస్రో తెలిపింది. ఆగస్టు 5న ఇస్రో ప్రణాళిక ప్రకారం చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆపై ఆగస్టు 23న జాబిల్లిపై చంద్రయాన్ 3 దిగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 99.75 తగ్గిన వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలు