Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో ఛైర్మన్ శివన్

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (15:59 IST)
చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టి భారత్ను అగ్ర దేశాల సరసన నిలిపిన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం పనులు ప్రారంభించింది. అయితే.. ఈ ప్రయోగం వచ్చే ఏడాదిలో చేపట్టే అవకాశాలున్నాయని.. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు లభించినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు.

గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములకు శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. చంద్రయాన్-3 ప్రయోగం వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభించినట్లు వెల్లడించింది. జాబిల్లిపై చేపట్టే ఈ ప్రయోగం 2020లోనే ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన నేపథ్యంలో.. ఈ మేరకు ప్రకటన చేశారు ఇస్రో ఛైర్మన్ కె. శివన్.

బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు శివన్. ల్యాండర్, రోవర్తో కూడిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ మిషన్కు సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గగన్‌యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని వెల్లడించారు.

భారత వైమానికి దళానికి చెందిన వీరికి జనవరి మూడో వారం నుంచీ శిక్షణ ప్రారంభమవుతుందని, రష్యాలో ఈ ట్రైనింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఎంపికైన వారి వివరాలను మాత్రం శివన్ వెల్లడించలేదు. 2022లో చేపట్టబోయే ఈ ప్రయోగంలో వ్యోమగాములు కనీసం ఏడు రోజులపాటు అంతరిక్షంలో గడపనున్నారు.

మహిళా వ్యోమగాములను కూడా ఈ ప్రయోగంలో భాగస్వాముల్ని చేయాలని యోచిస్తున్నట్టు ఇస్రో గత ఏడాది ప్రకటించింది. కాగా.. గగన్‌యాన్-2కు సంబంధించి ప్రస్తుతం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చేపట్టబోయే వాటిలో వ్యోమగాముల శిక్షణ ముఖ్యమైనదని శివన్ తెలిపారు. ఈ ఏడాది ఇస్రో 25 ప్రయోగాలు చేపట్టబోతోందని కూడా ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments