Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ : ప్రయాణంలో ఎన్ని మజిలీలు

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (16:41 IST)
చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ మొదలైంది. సోమవారం తెల్లవారుజామున 2.51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ప్రారంభంగల ఈ మిషన్‌కి సంబంధించి ఆదివారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మిషన్ ద్వారా చంద్రునిపై రోబోటిక్ రోవర్‌ని అడుగు పెట్టించాలన్నదే లక్ష్యంగా ఉంది.
 
ఈ ప్రయోగంలో కక్ష్యలోకి అతి బరువైన రాకెట్ లాంచర్ 'జీఎస్ఎల్వీ.. ఎంకే-3'ని చంద్రునిపైకి ప్రయోగిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని మొత్తం కాల వ్యవధి యేడాదిపాటుగా శాస్త్రవేత్తలు తెలిపారు. 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం సాగించి దాదాపు రెండు నెలల అనంతరం ఈ రాకెట్ లాంచర్ చంద్రుని సౌత్ పోల్ సమీపంలో దిగుతుందని వారు వివరించారు. 640 టన్నుల రాకెట్ లాంచర్ అయిన దీన్ని 'బాహుబలి'గా అభివర్ణిస్తున్నారు. 
 
ఈ లాంచర్ 15 అంతస్తుల బిల్డింగ్ అంతటి పొడవైనదిగా ఉంది. ఈ లాంచర్ 3.8 టన్నుల బరువైన ఉపగ్రహాన్ని చంద్రునిపైకి మోసుకుపోతుంది. భారతదేశం ప్రయోగిస్తున్న అతి బరువైన లాంచర్లలో ఇది మూడోది కావడం గమనార్హం. 
 
ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శ్రీహరి కోటకు చేరుకున్నారు. స్పేస్‌పోర్ట్ నుంచి లైవ్ లాంచ్‌ని చూసే మూడో రాష్ట్రపతి కానున్నారు ఆయన.. దాదాపు రూ.వెయ్య కోట్లతో చేపడుతున్న చంద్రయాన్-2 మిషన్‌లో 1.4 టన్నుల విక్రమ్ లాండర్ కూడా ఓ భాగం. ఇది 27 కిలోల బరువైన 'ప్రగ్యాన్' రోవర్‌ని మోసుకుపోతుంది.
 
కాగా, సుమారు 124 మిలియన్ డాలర్ల ఖర్చుతో చంద్రుడి ఆవలి వైపుకు ఇస్రో సాగిస్తున్న మహాయాత్ర చంద్రయాన్-2. సోమవారం వేకువజామున 2.51 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం1 రాకెట్ చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భారీ ప్రాజక్టుపై అమెరికా మీడియా వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శిస్తోంది. 
 
అగ్రరాజ్యం అమెరికా ఓవైపు అంగారకుడి వైపు పరుగులు పెడుతుంటే, ఇప్పుడందరూ చంద్రుడిపైకి మళ్లీ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అంగారకుడి వద్దకు వెళుతున్న అమెరికాకు చంద్రుడు మార్గమధ్యంలోని ఓ మజిలీ మాత్రమేనని, కానీ భారత్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి చంద్రుడి‌పైకి యాత్ర చేస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ విమర్శనాత్మక ధోరణిలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments