Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధాన్యం కొనుగోలు చేసిన 4 రోజుల్లో నగదు: వెంకయ్య

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (07:11 IST)
అన్నదాతల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే నాలుగు రోజుల్లో నగదు చెల్లించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారులకు సూచించారు.

కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు సరిగా అందడం లేదన్న ఆయన.. సకాలంలో బకాయిలు చెల్లించకుంటే కర్షకులు నష్టపోతారని అన్నారు.

ధాన్యం సేకరణ, నగదు చెల్లింపుల్లో ఆలస్యం వద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారులకు సూచించారు. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులపై దిల్లీలో ఆహార, ప్రజాపంపిణీశాఖ మంత్రులు, అధికారులతో ఆయన చర్చించారు.

కేంద్రమంత్రులు తోమర్, పాశ్వాన్‌లతో మాట్లాడిన ఆయన.. కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు సరిగా అందడం లేదని అన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాలను ప్రస్తావించారు.

ధాన్యం కొనుగోలు చేసిన 4 రోజుల్లో నగదు చెల్లించాలని చెప్పారు. ధాన్యం తూకం హెచ్చుతగ్గులపై వచ్చే ఫిర్యాదులను గమనించాలని అన్నారు.

కేంద్ర అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నిధుల విడుదలపై పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments