Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు.. దళారీ వ్యవస్ధకు చెక్!

15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు.. దళారీ వ్యవస్ధకు చెక్!
, సోమవారం, 14 అక్టోబరు 2019 (06:14 IST)
రైతులకు కనీస మద్దతు ధర గ్యారెంటీగా కల్పించాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈనెల 15నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

ఈ కొనుగోలు కేంద్రాల్లో ప్రకటించిన మద్దతు ధరలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.  రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని,  రూ. ౩ వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటెచేస్తుందని సీఎం జగన్‌ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిశగా ఆయన అనేక చర్యలు చేపట్టారు.

బడ్జెట్‌లో ధరలస్థిరీకరణకు కేటాయింపులు చేయడమే కాకుండా, రైతులు దళారులు బారని పడకుండా పంట చేతికొచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ సమీక్షా సమావేశాల్లో ఆదేశాలు జారీచేశారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌ ఆదేశాల మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ త్వరలో ఏర్పాటు చేయబోయే కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రణాళిక సిద్దంచేసుకుంది.

ప్రతి రైతు తాము సాగు చేసిన పంటను గ్రామ వ్యవసాయ/ఉద్యానవన సహాయకుడు ద్వారా "ఈ క్రాప్‌" నందు నమోదు చేసుకోవాలని సూచించింది. దీనికోసం రైతులకు సమీపంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా అక్టోబరు 15న మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ప్రారంభిస్తోంది. ఈ మేరకు పంటల కనీస మద్ధతు ధరల వివరాలను కూడా వెల్లడించింది. 
 
 
అక్టోబరు 15వ తేదీన 31 చోట్ల పెసలు, మినుములు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆయా కేంద్రాల వివరాలను ప్రకటించింది. 
 
మినుముల కొనుగోలు కేంద్రాల వివరాలు : 
గుంటూరు జిల్లా వడ్లమూడి కేంద్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ పరిధిలో తెనాలి, పొన్నూరు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ పరిధిలో రంగంపేట.
కృష్ణా జిల్లా గుడివాడ కేంద్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ పరిధిలో హనుమాన్‌ జంక్షన్‌, సిడబ్ల్యూసి రాయనపాడు పరిధిలో మైలవరం, పరిటాల
కర్నూలు జిల్లా నంద్యాల సిడబ్ల్యూసి పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ సిడబ్ల్యూసి పరిధిలో ఆళ్లగడ్డ.
 నందికొట్కూరు సిడబ్ల్యూసి పరిధిలో నందికొట్కూరు. ఆత్మకూరు సిడబ్ల్యూసి పరిధిలో ఆత్మకూరు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు స్టేట్‌ వేర్‌ హౌసింగ్ కార్పోరేషన్ పరిధిలో దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు.
 తాడేపల్లి గూడెం సిడబ్ల్యూసి పరిధిలో నల్లజెర్ల, పోలవరం, కన్నయ్యగుట్ట, కృష్టారావుపేట. 
 
 
పెసలు కొనుగోలు కేంద్రాలు : 
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిడబ్ల్యూసి పరిధిలో రంగంపేట.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సిడబ్ల్యూసీ పరిధిలో నందిగామం ఏఎంసి.
 రాయనపాడు సిడబ్ల్యూసి పరిధిలో పరిటాల, అల్లూరు, చౌటపల్లి, పొన్నవరం, మైలవరం.
కర్నూలు జిల్లా  నంద్యాల సిడబ్ల్యూసి పరిధిలో నంద్యాల. ఆళ్లగడ్డ సిబ్ల్యూసి పరిధిలో ఆత్మకూరు.
పశ్చిమగోదావరి జల్లా ఏలూరు ఎస్‌డబ్ల్యూసి పరిధిలో దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎస్‌డబ్ల్యూసి గౌడెన్ పరిధిలో జంగారెడ్డిగూడెం, నల్లజెర్ల, పోలవరం, కన్నయ్యగుట్ట, కృష్టారావుపేట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమస్యేదైనా పరిష్కరిస్తా... సింగపూర్‌ ఎన్‌ఆర్‌ఐలతో వైవీ