Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ ఉగ్రవాదం కామెంట్స్.. కమల్ హాసన్‌పై కేసులు... అరెస్టు ఖాయమా?

ఈనెల ఏడో తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న విశ్వనటుడు కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. హిందూ ఉగ్రవాదంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఈ తమిళ నటుడిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సెక్షన్ల కిం

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (09:56 IST)
ఈనెల ఏడో తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న విశ్వనటుడు కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. హిందూ ఉగ్రవాదంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఈ తమిళ నటుడిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిపై శనివారం విచారణ జరుగనుంది. 
 
ఒక మ‌తాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు సెక్షన్‌ 500 కింద కేసు న‌మోదు చేశారు. అలాగే 511 సెక్ష‌న్‌ కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్‌ 298 కింద పరుష వ్యాఖ్యలతో మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్‌ 295(ఏ) కింద మత విశ్వాసాలను కించపరచడం, మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్‌ 505(సీ) కింద ఒక వర్గంపైన, మతంపైన దాడులు చేసేలా మాట్లాడ‌డం వంటి అభియోగాలపై కమల్ హాసన్ కేసుల్లో ఇరుక్కున్నాడు. ఈ కేసులన్నింటిపై శనివారం విచారణ జరుగనుంది. 
 
కాగా, 'హిందూ ఉగ్ర‌వాదం' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు కమల్ హాసన్‌పై దేశంలోని ప‌లువురు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఉద్దేశం ఉంటే మంచి ప‌నులు చేసి రావాల‌ని, ఇటువంటి వ్యాఖ్య‌లు చేసి వార్తల్లో నిల‌వాల‌ని చూడ‌కూడ‌ద‌ని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే, ఈ కేసులన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments