Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి అంకానికి కర్నాటక రాజకీయం... తదుపరి సీఎంగా యడ్డి?

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (14:23 IST)
కర్నాటక రాజకీయం తుది అంకానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తనకు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు యడ్యూరప్ప ప్రకటించారు. దీంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం మరింత కష్టాల్లో పడినట్టుగా చెప్పవచ్చు. 
 
కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ సర్కారును నడుపుతుండగా, ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమార స్వామి ఉన్నారు. అయితే, ఆయనకు మద్దతు ఇస్తున్న పలువురు ఎమ్మెల్యేలు ఉపసంహరించుకున్నారు. ఈ సంఖ్య 14కు చేరింది. పైగా, అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నా వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా, రాజీనామా చేసిన వారికితోడు మరో ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలు జత కావడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏ క్షణాన్నైనా కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం తరించుకున్నాయి. తన చేతిలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు గవర్నర్‌ను కలిసి తాము బీజేపీకి మద్దతు ఇస్తామని లేఖలు ఇచ్చారని, దీంతో తమ బలం 107కు చేరుకుందన్నారు. ఇప్పుడేం జరుగుతుందో చూద్దామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 
 
మరోవైపు, సమస్య పరిష్కారమైందని, ఇక చింతించాల్సిన పనిలేదని, ప్రభుత్వం సాఫీగా సాగిపోతుందని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించిన కాసేపటికే యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాగా, రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేశ్ కుమార్ మంగళవారం నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో ఇవ్వలేదని భావిస్తే విచారణను వాయిదా వేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments