Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశాభివృద్ధిలో తెలుగు ఎన్నారైలు భాగస్వామ్యం కావాలి : ఎస్. విష్ణువర్థన్ రెడ్డి

దేశాభివృద్ధిలో తెలుగు ఎన్నారైలు భాగస్వామ్యం కావాలి : ఎస్. విష్ణువర్థన్ రెడ్డి
, శనివారం, 6 జులై 2019 (18:11 IST)
అమెరికాలో జరుగుతున్న తానా 22వ మహాసభల్లో అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికాలో స్థిరపడిన భారతీయులందరూ ప్రధానంగా తెలుగు వాళ్ళు భారతదేశం అభివృద్ధిలో, సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్య శిక్షణలో మీ సహకారాన్ని మరింత యవతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
అమెరికాలో తెలుగు పరిరక్షణ కోసం, అభివృద్ధి కోసం మీరుఅందరూ ప్రయత్నిస్తున్న తీరు మీ పిల్లలను తెలుగు భాషలో మాట్లాడడం, మీరు భాషను అదరుస్తున్న, అనుసరిస్తున్నవిధానం మాకు గొప్ప అనుభూతిని నింపిందన్నారు. ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు అవసరమైనటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. 
 
ఇక్కడ స్థిరపడిన అటువంటి అనేక మంది భారతీయులు తెలుగువారు, మీప్రతిభ కారణంగానే ఖండాంతరాలు దాటి మీరు అమెరికాలో ఉన్నతమైన స్థానాల్లో అనేకమంది ఉన్నారన్నారు. కాబట్టి భారతీయ యువతకు నైపుణ్య శిక్షణలో ఆర్థికాభివృద్ధిలో ఉద్యోగ కల్పనలో మీ వంతు సహకారం రాబోయే రోజుల్లో మరింతగా ఆంధ్రా, తెలంగాణాకు ఆశిస్తున్నట్టు చెప్పారు 
 
తానా మహాసభల్లో ప్రవాస భారతీయులు చూసిన తర్వాత ఒక విశ్వాసం కలుగుతుందని, నేడు అభివృద్ధి కావాలంటే రాజకీయ అధికారం చాలా కీలకంగా మారబోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలోగానీ దేశాభివృద్ధిలోగానీ మీసహకారం రోజురోజుకు పెరుగుతున్న సమయంలో అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఇందులో తెలుగువారు ముఖ్యంగా అమెరికా దేశంలో పలు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంది కాబట్టి మరింతగా ఈరంగంలో మీభాగస్వామ్యం పెరగాల్సిన అవసరం  చాలా ఉంది.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్‌టీని మీ తలకు కండీషనర్‌లా రాసినట్లయితే?