Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిటైర్మెంట్ తర్వాత బీజేపీలోకి ధోనీ..?

రిటైర్మెంట్ తర్వాత బీజేపీలోకి ధోనీ..?
, ఆదివారం, 7 జులై 2019 (12:15 IST)
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బీజేపీ కన్నేసింది. జార్ఖండ్ ఎన్నికల్లో ధోనీ పాపులారిటీ పార్టీకి ఉపయోగపడుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. జెఎంఎం, ఆర్జెడి, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి జార్ఖండ్‌లో ధోనీ ప్రజాదరణను వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. 
 
ఒక వేళ ధోనీ తమ పార్టీలో చేరడానికి ఇష్టపడకపోతే కనీసం ప్రచారానికైనా వాడుకునే విధంగా చూడాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. జార్ఖండ్ శానససభ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనున్నాయి. 
 
బీజేపీ నాయకులు పలువురు ధోనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్ టోర్నమెంటు తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నందున ఇప్పటి నుంచే బీజేపీ నేతలు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. 
 
అయితే, ధోనీ తన రిటైర్మెంటు గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేదు.తాను ఎప్పుడు రిటైర్ అవుతానో తనకు తెలియదని అన్నాడు. ధోనీ రిటైర్మెంటు తమకు ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
 
రిటైర్మెంటు తర్వాత రాజకీయాల్లోకి రావడానికి ధోనీ ఆసక్తి చూపుతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఏ పార్టీలో చేరుతారా, లేదా అనేది ఆయనకే వదిలేస్తామని కూడా అంటున్నారు.
 
సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా నిరుడు ఆగస్టు 5వ తేదీన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు పియూష్ గోయల్, సరోజ్ పాండే , మనోజ్ తివారీ ధోనీ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాలంటీర్లే రేషన్ సరుకులు ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తారు...