Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం : ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (16:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహ్ముదాబాద్‌లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించి చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిలా మారిపోయాడు. 11 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టింది పీఈటీ టీచర్ కావడం గమనార్హం. 
 
పోలీసుల కథనం మేరకు.. మంగళవారం స్కూల్‌కు వెళ్లిన బాలిక పాఠశాల సమయం ముగిసినా ఇంటికి రాకపోవడంతో తండ్రి ఆమె కోసం వెతికాడు. బాలిక అదృశ్యమైన విషయం తెలుసుకున్న స్థానికులు ఉపాధ్యాయుడు సంజయ్‌ గుప్తా ఇంటి తలుపులు పగలగొట్టి.. బాలికను రక్షించారు. అనంతరం అతడిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టీచర్‌ సంజయ్‌ గుప్తాను అరెస్టు చేశారు. 
 
స్థానికుల దాడిలో తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నట్లు మహ్ముదాబాద్‌ పోలీస్‌ అధికారి దినేశ్‌ శుక్లా వెల్లడించారు. గుప్తా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. తన కోర్కెలు తీర్చకపోతే కొట్టడంతో పాటు స్కూల్‌లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించాడని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం